ANU పరిధిలో పరీక్ష షెడ్యూల్ విడుదల
GNTR: ANU పరిధిలోని వ్యాయామ కళాశాలలో బీపీఈడీ, ఎంపీఈడీ, డీపీఈడీ 4వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్‌ను సీఈ ఆలపాటి శివప్రసాద్ విడుదల చేశారు. ఏప్రిల్ 21 నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కానుండగా.. విద్యార్థులు తమ పరీక్ష ఫీజును ఏప్రిల్ 8 లోపు చెల్లించాలి. ఆలస్యమైతే రూ.100 అపరాధ రుసుముతో ఏప్రిల్ 9 వరకు అవకాశం కల్పించారు. పూర్తి వివరాల కోసం యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ను చూడవచ్చు.