ఆటో డ్రైవర్‌కు భారీ జరిమానా
ప్రకాశం: టంగుటూరు మండలంలో నిబంధనలను ఉల్లంఘించి, పరిమితికి మించి కూలీలను ఆటోలలో తరలిస్తున్న ఆటో డ్రైవర్లకు పోలీసులు షాక్ ఇచ్చారు. ఎస్ఐ నాగమల్లేశ్వరరావు జరిమానా విధించడంతో పాటు కూలీలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. పరిమితికి మించి కూలీలను తరలించడం ప్రమాదాలకు దారితీయవచ్చని, మళ్లీ ఇలా చేస్తే వాహనాన్ని సీజ్ చేస్తామని డ్రైవర్లను హెచ్చరించారు