డయేరియా బాధితులను పరామర్శించిన మంత్రి

డయేరియా బాధితులను పరామర్శించిన మంత్రి

NTR: విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో ఏర్పాటు చేసిన డయేరియా మెడికల్ క్యాంపును మంత్రి నారాయణ సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. అనంతరం డీఎంహెచ్‌ఓ సుహాసినిని కలిసి, రోగులకు అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని డీఎంహెచ్‌ఓ మంత్రికి వివరించారు.