గీత కార్మికుడికి తీవ్ర గాయాలు

గీత కార్మికుడికి తీవ్ర గాయాలు

NLG: మునుగోడు మండలం చొల్లేడు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం తాటిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడి ఆడపు లక్ష్మయ్య(42) అనే గీత కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో అతడి వెన్నెముక, కాలు విరిగినట్లు స్థానికులు తెలిపారు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.