‘రేపటి POLYCET పరీక్షకు ఏర్పాట్లు పూర్తి’
NDL: రేపు జరిగే POLYCET-2026 ప్రవేశం పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా POLYCET కోఆర్డినటర్ శైలేంద్ర కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 7,221 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు అవుతున్నారన్నారు. విద్యార్థులు కేంద్రాలకు హాల్ టికెట్ తీసుకుని పరీక్ష సమయం కన్నా గంట ముందు చేరుకోవాలని సూచించారు.