VMRDA మాస్టర్ ప్లాన్ రోడ్లను పరిశీలించిన ఎమ్మెల్యే గంటా, ఛైర్మన్ ప్రణవ్

VSP: VMRDA ప్రతిపాదించిన మాస్టర్ ప్లాన్ రోడ్లను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ బుధవారం పరిశీలించారు. రోడ్ల నిర్మాణాన్ని త్వరగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అడవివరం, భీమిలి బీచ్ రోడ్డు, పాత అడవివరం, అనందపురం, పెద్దిపాలెం, దొరతోట, నేరెళ్లవలస జంక్షన్లను పరిశీలించారు. ఎలైన్మెంట్ మార్పులపై చర్చించారు.