జిల్లాలో జోరుగా వరి కోతలు..
NLG: జిల్లాలో వానాకాలం వరి కోతలు ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 5.05 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందులో నాన్ ఆయకట్టు ప్రాంతంలో సుమారు 3 లక్షల ఎకరాలు వరి సాగయింది. అయితే నాన్ ఆయకట్టులో జూన్ మొదటి వారంలోని బోరుబావుల కింద వరి నారు పోసుకున్న రైతులు జులైలో నాట్లు వేసుకున్నారు. దీంతో ముందస్తుగా సాగుచేసిన వరి పంటను మూడు రోజుల నుంచి రైతులు ముమ్మరంగా కోస్తున్నారు.