ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు: SP

W.G: వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతుల పొందేందుకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని ఎస్పీ మణికంఠ గురువారం స్పష్టం చేశారు. మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో క్లియరెన్స్ విధానం తీసుకొచ్చామన్నారు. ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేస్తే సరిపోతుందన్నారు. మైక్ అనుమతులను మీసేవ కేంద్రాలలో పొందాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు.