నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NGKL: ఊర్కొండ మండలం మాదారం గ్రామంలో బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ ఏఈ సాయన్న గౌడ్ తెలిపారు. గ్రామంలోని 33/11 కేవీ సబ్ స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా ఆ సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.