కదిరి బ్రహ్మరథోత్సవంలో అపశ్రుతి
సత్యసాయి జిల్లాలోని కదిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. రథం లాగుతున్న సమయంలో చక్రం కింద ఒకరు పడిపోయారు. దీంతో ఆ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఆ వ్యక్తిని కాపాడే సమయంలో మరో ఐదుగురికి గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.