చెరువులో వృద్ధుడి మృతదేహం లభ్యం

చెరువులో వృద్ధుడి మృతదేహం లభ్యం

KMR: పిట్లం మండలంలోని పారడ్‌పల్లిలో విషాదం నెలకొంది. ఆదివారం అదృశ్యమైన గుంట రాములు (58) అనే వ్యక్తి సోమవారం స్థానిక చెరువులో శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.