నెలవంకలా దర్శనమిచ్చిన భూమి

నెలవంకలా దర్శనమిచ్చిన భూమి

అమెరికా అంతరిక్ష సంస్థ (NASA) 'ఆర్టెమిస్-2'ను ప్రయోగించిన విషయం తెలిసిందే. చంద్రుడి దిశగా ఇది చేస్తోన్న ప్రయాణంలో ఓరియన్‌లోని సోలార్ అరే కెమెరా అంతరిక్షం నుంచి భూమి చిత్రాలను తీసింది. ఈ దృశ్యాలను నాసా షేర్ చేసింది. ఆ చిత్రాల్లో భూమి నెలవంకలా దర్శనమిచ్చింది. కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి నలుగురు వ్యోమగాములతో కూడిన ఓరియన్ క్యాప్సూల్ జాబిల్లి వైపు దూసుకెళ్తోంది.