'పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్నారు'
ASF: మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారని అసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత కొనియాడారు. మంగళవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్‌లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె ప్రసంగించారు. మహిళలు అన్ని రంగాలలో రాణించాలని, అందరికీ ఆదర్శంగా ఉన్నత స్థానానికి ఎదగాలని, ప్రతి మహిళ సాటి మహిళకు అండగా నిలబడాలని తెలిపారు.