మైదుకూరులో నియోజకవర్గ స్థాయి వాలీబాల్ పోటీలు

మైదుకూరులో నియోజకవర్గ స్థాయి వాలీబాల్ పోటీలు

KDP: కేంద్ర క్రీడాశాఖ, మైభారత్, అమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 12న మైదుకూరు మేధా డిఫెన్స్ అకాడమీలో వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నట్లు అధికారి పీ.ప్రదీప్ కుమార్ మంగళవారం తెలిపారు. 16-28 ఏళ్ల యువకులు ఈ పోటీలలో పాల్గొనడానికి అర్హులన్నారు. విజేతలకు నగదు బహుమతులు, ట్రోఫీలు, ప్రతిభ కనబరిచిన జట్లను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు.