అమెరికా బలగాల ఆధీనంలోనే F-15E పైలట్
అమెరికా యుద్ధ విమానం F-15E కూలిపోయిన ఘటనలో రెండో పైలట్‌ను గుర్తించారు. అతడు సురక్షితంగా, అమెరికా బలగాల ఆధీనంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 3న అమెరికాకు చెందిన యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చింది. ఈ ఘటనలో ఒక పైలట్‌ను కాపాడగా, రెండో పైలట్ కనిపించకపోవడంతో US, ఇరాన్ అతడి కోసం జల్లెడ పట్టాయి. ప్రస్తుతం ఇద్దరు పైలట్లను ఇరాన్ భూభాగం నుంచి తీసుకురావాల్సి ఉన్నట్లు సమాచారం.