కొత్తవలసలో షటిల్ కోర్టును ప్రారంభించిన రైల్వే మేనేజర్
VZM: కొత్తవలస రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అమృత్ భారత్ పనులు ఈ ఏడాది జూన్ లోపు పూర్తిచేస్తామని వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్ర తెలిపారు. ఆదివారం షటిల్ కోర్టును ఆయన ప్రారంభించారు. కొత్తవలస రైల్వేస్టేషన్‌ను దువ్వాడ రీతిలో మెరుగుపరుస్తామని చెప్పారు. రాయగడ గుంటూరు, కోర్బా విశాఖ, ఇంటర్ సిటీ నిలుపుదలకు రైల్వేబోర్డు పరిశీలనలో ఉందన్నారు.