VIDEO: ప్రైవేట్ పాఠశాల ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన
MHBD: మహబూబాబాద్ పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో హిందీ పండితుడు 6వ తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. విద్యార్థి సంఘ నాయకులు మంగళవారం పాఠశాల ఎదుట నిరసనకు దిగారు. అనుమతి లేకుండా నడుస్తున్న పాఠశాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.