భర్తను చంపి సహజ మరణంగా చిత్రించిన భార్య
BDK: చండ్రుగొండ మండలం తిప్పనపల్లిలో జాఫర్ అనుమానాస్పద మృతి కేసు హత్యగా తేలింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భార్య ఖతీజా, తన ప్రియుడు మీరా సాహెబ్‌తో కలిసి భర్తను హతమార్చింది. అనంతరం దానిని సహజ మరణంగా నమ్మించే ప్రయత్నం చేసింది. దర్యాప్తు, వైద్యుల నివేదిక ఆధారంగా పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేసినట్లు సీఐ శ్రీలక్ష్మి తెలిపారు.