VIDEO: జిల్లాలో కూలిన జనసేన ప్రభ
PLD: జిల్లాలో అడివి పేరంటాలమ్మ తిరునాళ్లకు ఏర్పాటు చేసిన జనసేప ప్రభ కూలింది. శావల్యపురం మండలం మతుకుమల్లిలో జరగనున్న తిరునాళ్లకు అమర్చిన జనసేన ప్రభ శుక్రవారం నేలకొరిగింది. ప్రభకూలిన దిశలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం జరగలేదు. అకస్మాత్తుగా జరిగిన ఘటనతో ఈ ఉత్సవాలకు వచ్చిన వారు భయభ్రాంతులకు గురయ్యారు.