'కడియం తన పదవికి రాజీనామా చేయాలి'
JN: కడియం శ్రీహరికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న తక్షణమే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. ఘనపూర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ కడియం శ్రీహరి ఘనపూర్‌కు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలన్నారు. కడియం తన కూతురు రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆరోపించారు.