నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
SKLM: టెక్కలిలో 33/11కేవీ సబ్ స్టేషన్ నిర్వహణ పనుల నిమిత్తం శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏపీ ఈపీడీసీఎల్ ఈఈ నర్సింహ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి, విద్యుత్ శాఖ వారికి సహకరించాలని ఆయన కోరారు.