'ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలి'

SRPT: ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామ సెంటర్‌లో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని జడ్పీ సీఈవో అప్పారావు అన్నారు. గురువారం మద్దిరాల మండలం రెడ్డిగూడెంలో పశువుల పాకలు, ఇంకుడు గుంతలను పరిశీలించి మాట్లాడారు. వృథాగా పోయే నీటిని ఒడిసిపట్టి భూమిలో ఇంకేలా చర్యలు తీసుకోవాలన్నారు. వారి వెంట ఎంపీడీవో సత్యనారాయణ, ఏపీఎం వెంకన్న, ఫీల్డ్ అసిస్టెంట్, సిబ్బంది పాల్గొన్నారు.