రెవెన్యూ సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్

JN: స్టేషన్ ఘనపూర్ మండలం కొత్తపల్లిలో ఇవాళ నిర్వహించిన రెవెన్యూ సదస్సులో జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాల్గొన్నారు. భూభారతి చట్టం అమలులో భాగంగా ప్రజల నుంచి భూ సంబంధిత దరఖాస్తులు స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు కలెక్టర్ చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.