నీళ్ళు ఉన్న పంటలను ఎండపెడుతున్న కాంగ్రెస్: పుట్ట మధుకర్

కరీంనగర్: ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీళ్లు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని విడుదల చేయడం లేదని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు. ఈ సందర్బంగా శనివారం మంథని మండలం సూరయ్యపల్లిలో నీరు లేక ఎండిపోతున్న పంట పొలాలను స్థానిక రైతులు, నాయకులతో కలిసి పరిశీలించారు. ఎండిన పంట పొలాలకు వెంటనే నష్ట పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు.