ధాన్యం కొనుగోళ్లలో కొర్రీలు..!
NLG: నల్గొండ మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. IKP కేంద్రాల్లో కాంటా వేసిన ధాన్యాన్ని రైతులు మిల్లులకు పంపిస్తుండగా, మిల్లర్లు అన్‌లోడింగ్‌లో కొర్రీలు పెడుతూ అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెటింగ్ అధికారులు వెంటనే స్పందించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు.