చనిపోతూ ఇద్దరి జీవితాల్లో వెలుగులు
JGL: కోరుట్ల పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నల్లాల లక్ష్మీరాజం ఆకస్మిక మరణం పోలీస్ శాఖను విషాదంలో ముంచింది. విధి నిర్వహణలో సేవలందించిన ఆయన, మరణానంతరం తన అవయవాలను దానం చేసి ఇద్దరికి ప్రాణదాతగా నిలిచారు. ఆయన భార్య రాధ చూపిన ధైర్యం సమాజానికి ఆదర్శంగా నిలుస్తోందని పోలీసులు తెలిపారు. ఒక జీవితం ముగిసినా.. మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింప్పారని అన్నారు.