ఎమ్మెల్యే సూచనలతో అవనిగడ్డలో జంగిల్ క్లియరెన్స్

ఎమ్మెల్యే సూచనలతో అవనిగడ్డలో జంగిల్ క్లియరెన్స్

కృష్ణా: అవనిగడ్డ ఒకటో వార్డులో శనివారం జంగిల్ క్లియరెన్స్ చేయించారు. ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ సూచనల మేరకు యలవర్తి ఆది హరిత హాస్పిటల్ నుంచి అపార్ట్మెంట్ వరకు సీసీ రోడ్డుకు ఇరువైపులా, బొమ్మల సెంటర్ పరిసరాలు, లంస బేకరీ పరిసరాల్లో ఇబ్బడిముబ్బడిగా పెరిగిన పిచ్చిమొక్కలు, ముళ్లపొదలను జేసీబీతో తొలగించారు. కూనపరెడ్డి చంద్రశేఖర్, తుంగల శ్రీను పాల్గొన్నారు.