నేడు అమ్మనబ్రోలుకు మంత్రి లోకేష్

నేడు అమ్మనబ్రోలుకు మంత్రి లోకేష్

AP: ప్రకాశం జిల్లాలోని అమ్మనబ్రోలుకు మంత్రి నారా లోకేష్ వెళ్లనున్నారు. గత నెలలో టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఇవాళ వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను లోకేష్ పరామర్శించనున్నారు. ఉదయం 8గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరనున్నారు. 9:30 నుంచి 10 గంటల వరకు వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.