జీఆర్పీ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ
VZM: వార్షిక తనిఖీల్లో భాగంగా విజయనగరం జీఆర్పీ స్టేషన్‌ను విశాఖపట్నం రైల్వే డీఎస్పీ రామచంద్రరావు శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. రైళ్లలో దొంగతనాలు జరగకుండా నిఘా పెంచాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తు త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. రైళ్లలో గంజాయి రవాణా అడ్డుకట్ట వేయాలన్నారు.