శతజయంతి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
సత్యసాయి: సత్యసాయి శతజయంతి ఉత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్ శ్యాంప్రసాద్, జేసీ మౌర్య భరద్వాజ్ సమీక్షించి, ఏర్పాట్లను పరిశీలించారు. పోలీస్ గ్రౌండ్స్, ఆనంద విల్లాస్, శిల్పారామం, చిత్రావతి బ్రిడ్జి మార్కెట్ తదితర ప్రాంతాలలో వారు పర్యటించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పార్కింగ్ సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.