నిరుపయోగంగా మారిన తాగునీటి ట్యాంక్
GDL: అయిజ పరిధిలోని పర్దీపురం కాలనీలో రెండేళ్లుగా తాగునీటి ట్యాంక్ నిరుపయోగంగా మారింది. మిషన్ భగీరథ పైపులైను సక్రమంగా లేకపోవడం వలన నీరు ట్యాంకుకు చేరడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాగునీటి సమస్య ఏర్పడి, కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి, పైపులైనును సరి చేయాలని కోరుతున్నారు.