ఓదెలలో బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన
Pdpl: భవిష్యత్తులో మహిళా సాధికారత సాధించాలంటే బాల్య వివాహాలను అరికట్టడంతోపాటు వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని జిల్లా మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త డా. దయా అరుణ అన్నారు. బుధవారం ఓదెల మండలం గూడెం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.