'పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత'
MHBD: పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని మున్సిపల్ ఛైర్‌పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి అన్నారు. మరిపెడ మున్సిపాలిటీ 14వ వార్డు పరిధిలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. మరిపెడ పట్టణ సుందరీకరణకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పారు. కౌన్సిలర్లు రాము, తిరుపతి, లచ్చిరాం ఉన్నారు.