మేకల కాపరిపై ఎలుగుబంటి దాడి

మేకల కాపరిపై ఎలుగుబంటి దాడి

NGKL: పదరా మండలం పెట్రోల్ చేను ఆదివాసి పెంటకు చెందిన చిగుర్ల ప్రశాంత్ పై మద్దిమడుగు రేంజ్ పరిధిలో ఎలుగుబంటి దాడి చేసింది. బుధవారం అతడు మేకలను కాస్తూనే కుంకుడు కాయలు సేకరిస్తుండగా చిన్న బోడ్ అడవి ప్రాంతంలో పిల్లలతో ఉన్న ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేసింది. ఈ ప్రమాదంలో అతని కుడి చేతికి ఆరు చోట్ల బలమైన గాయాలైనట్లు గ్రామస్తులు తెలిపారు.