పహల్గామ్ ఉగ్రదాడిలో విశాఖ వాసి మృతి

VSP: జమ్ము-కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిలో విశాఖ వాసి ఒకరు మృతి చెందారు. విశాఖకు చెందిన పర్యాటకుడు చంద్రమౌళిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. పారిపోతున్నా వదలకుండా వెంటాడి కాల్చి చంపినట్లు సమాచారం. చంద్రమౌళి మృతదేహాన్ని సహచార టూరిస్టులు గుర్తించారు. నేడు మృతదేహాన్ని విశాఖకు తీసుకువచ్చే అవకాశం ఉంది.