నేటి నుంచి జనగణన.. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడంటే?
ఇవాళ్టి నుంచి దేశవ్యాప్తంగా జనగణన ప్రక్రియ ప్రారంభం కానుంది. వ్యక్తిగత డేటా గోప్యతకు పూర్తి భద్రత కల్పిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. APలో(మే 1-30), TGలో(మే 11-జూన్ 9) ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. రెండో దశలో కులం వివరాలను సేకరించనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. దేశ భవిష్యత్తు ప్రణాళికల కోసం ప్రతి ఒక్కరూ తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయించుకోవాలని అధికారులు కోరారు.