'మహిళా బిల్లును డిలిమిటేషన్‌తో ముడిపెట్టొద్దు'
KRNL: మహిళా రిజర్వేషన్ బిల్లును డిలిమిటేషన్‌తో ముడిపెట్టడం తగదని ఇవాళ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మీసాల సుమలత అన్నారు. ప్రతిపక్షాల ఐక్యతను స్వాగతిస్తూ మహిళా హక్కులను కాపాడాలని పిలుపునిచ్చారు. మహిళా రిజర్వేషన్ చట్టానికి తాము మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేశారు. మహిళల హక్కులకు భంగం కలిగించే చర్యలను ప్రతిపక్షాలు అడ్డుకుంటాయని తెలిపారు.