రవి అరెస్ట్‌పై మరోసారి స్పందించిన శివాజీ

రవి అరెస్ట్‌పై మరోసారి స్పందించిన శివాజీ

ఐబొమ్మ రవి అరెస్ట్‌పై సీనియర్ నటుడు శివాజీ మరోసారి స్పందించాడు. రవి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పాడు. సినీ ఇండస్ట్రీలో 95 శాతం మంది సాదాసీదా జీవితమే గడుపుతున్నారని తెలిపాడు. అలాగే, పెద్ద సినిమాల విడుదల సమయాల్లో చిన్న చిత్రాలు ఇబ్బంది పడుతున్నాయని వెల్లడించాడు. కాగా, రవిని దేశం కోసం ఉపయోగపడేలా సద్వినియోగం చేసుకోవాలని శివాజీ పేర్కొన్న విషయం తెలిసిందే.