కడియపులంక సర్పంచ్‌గా పద్మావతి ఏకగ్రీవం

కడియపులంక సర్పంచ్‌గా పద్మావతి ఏకగ్రీవం

KKD: కడియం మండలం కడియపులంక సర్పంచ్ ఉప ఎన్నికల్లో మారిశెట్టి పద్మావతి ఏకగ్రీవమైనట్లు స్టేజ్-1 రిటర్నింగ్ అధికారి మణికుమార్ మంగళవారం తెలిపారు. సర్పంచ్ పదవిలో ఉంటూ మృతి చెందిన మార్గాని అమ్మాణి కుమార్తె పద్మావతి పోటీలో ఉండడంతో ఇతర పార్టీల వారు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. దీంతో ఇక్కడ ఎన్నికలు జరగకుండా ఏకగ్రీవం అవడానికి అవకాశం ఏర్పడింది.