నేడు , రేపు పలు రైళ్ల దారి మళ్లింపు

VZM: స్థానిక సంతకాల వంతెన వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పిన నేపథ్యంలో ఆయా మార్గంలో ప్రయాణించే పలు రైళ్లను రెండు రోజుల పాటు రద్దు చేయగా.. కొన్నింటిని దారి మళ్లించినట్లు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైల్వే సాంకేతిక నిపుణుల బృందం ఆధ్వర్యంలో పట్టాలు తప్పిన గూడ్స్‌ను తొలగించే ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది.