ప్రధాని మోదీ సరికొత్త రికార్డు
భారత రాజకీయాల్లో ప్రధాని మోదీ ఓ చారిత్రక మైలురాయిని అందుకున్నారు. ఎన్నికైన ప్రభుత్వానికి అత్యధిక కాలం అధినేతగా పనిచేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. సిక్కిం మాజీ సీఎం పవన్‌కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న రికార్డును మోదీ అధిగమించారు. పవన్‌కుమార్ చామ్లింగ్ సిక్కిం CMగా 8,930 రోజులు పదవిలో కొనసాగగా, మోదీ ఆ రికార్డును దాటి 8,931 రోజులు పూర్తి చేసుకున్నారు.