రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు

NZB: ఎడపల్లి పట్టణంలో డీఏం గార్డెన్ వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెగడాపల్లికి చెందిన సురేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. నిజామాబాద్ నుంచి పెగడపల్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. స్థానికులు గమనించి 108కు సమాచారం అందించగా, సకాలంలో స్పందించి అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది EMT గంగామణి, పైలెట్ అనిల్ ప్రధమ చికిత్స చేసి బోధన్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.