పేదల ఆర్థిక ప్రగతికి పీ-4 దోహదం: ఎమ్మెల్యే వసంత
NTR: పేదల ఆర్థికస్థితిని మెరుగు పర్చడమే పీ-4 కార్యక్రమ ప్రధాన లక్ష్యమని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. పీ-4 కార్యక్రమంలో భాగంగా మైలవరం జ్యుయలరీ షాప్స్ ఆధ్వర్యంలో మేడసాని కిషోర్ సౌజన్యంతో కొండపల్లిలో 10 కుటుంబాలకు రూ.80 వేల విలువైన సామాగ్రి, నగదును ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గురువారం అందజేశారు.