విద్యార్థి మృతిపై కళాశాల వద్ద ఆందోళన

విద్యార్థి మృతిపై కళాశాల వద్ద ఆందోళన

KKD: కళాశాల వాహనం ఢీకొని విద్యార్థి మృతి చెందిన ఘటన కాకినాడలో జరిగింది. శ్రీ చైతన్య కళాశాలలో చదువుతున్న విద్యార్థి యువన్ శంకర్‌ను కళాశాల వాహనం ఢీకొట్టింది. దీంతో విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. యాజమాన్యం తక్షణం స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతుని బంధువులు కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు. అక్కడ పోలీసులు లేకపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.