ఎమ్మెల్యే ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం: ఏసీపీ
SDPT: దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సిద్దిపేట పోలీసులపై చేసిన ఆరోపణలను సిద్దిపేట పోలీస్ శాఖ తీవ్రంగా ఖండిస్తోందని ఏసీపీ రవీందర్ తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలీసులు అధికార పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇస్తూ, మిగతా అభ్యర్థులపై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారనే MLA వ్యాఖ్యలు పూర్తిగా అసత్యం, అవాస్తవం అని వివరించారు.