చిక్కుకుపోయిన భారతీయులు.. రంగంలోకి 14 విమానాలు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల చిక్కుకుపోయిన భారతీయుల కోసం ఇండిగో, స్పైస్‌జెట్ ప్రత్యేక విమానాలు నడుపుతున్నాయి. జెడ్డా నుంచి ఇండిగో 10, UAE నుంచి స్పైస్‌జెట్ 4 రిలీఫ్ ఫ్లైట్స్ ఇవాళ నడపనున్నాయి. దాదాపు 357 విమానాలు రద్దు కాగా, ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇవాళ సాయంత్రం నుంచి సర్వీసులు క్రమంగా పునరుద్ధరిస్తున్నారు.