సా.5.30 గంటలకు మీడియా సమావేశం

ఆపరేషన్ సింధూర్‌పై సా.5.30 గంటలకు విదేశాంగశాఖ మీడియా సమావేశం నిర్వహించనుంది. ఈ భేటీలో ఆపరేషన్ సింధూర్‌పై కీలక వివరాలను వెల్లడించనుంది. మరోవైపు సరిహద్దుల్లో పాక్ కాల్పులు జరుపుతుండడంతో తాజా పరిణామాలపై ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాతో జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ డోభాల్ సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు.