ఈనెల 15న ఎంఆర్‌వో ఆఫీస్‌ను ముట్టడిస్తాం: MRPS

BHPL: జిల్లా కేంద్రంలో MRPS టౌన్ అధ్యక్షుడు దోర్నాల భరత్ ఆధ్వర్యంలో శనివారం సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మడిపల్లి శ్యాంబాబు, అంబాల చంద్రమౌళి హాజరై మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలో ఇచ్చిన హామీల ప్రకారం పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈనెల 15వ తేదీన ఎంఆర్‌వో ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు.