అంగన్వాడీ కోరుతూ ఎమ్మెల్యేకు వినతి

అంగన్వాడీ కోరుతూ ఎమ్మెల్యేకు వినతి

NLR: ఇంద్రానాయక్‌నగర్‌లో అంగన్వాడీ ఏర్పాటు చేయాలని మహిళలు,స్థానిక నాయకులు సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమాకు వినతి పత్రం అందజేశారు. గర్భిణులు, చిన్నపిల్లలు 3 కి.మీ ప్రయాణించాల్సి వస్తోందని తెలిపారు. కాలనీలో కుటుంబాలు అధికంగా ఉండటంతో అంగన్వాడీ అవసరమని కోరారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ప్రాజెక్ట్ డైరెక్టర్‌తో మాట్లాడి సమస్య త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.