అంగన్వాడీ కేంద్రాల పరిశీలన
NZB: సిరికొండ మండలంలోని హుస్సేన్ నగర్, గడ్కోలు, రామడుగు గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను బుధవారం ఎంపీవో తారచంద్ పరిశీలించారు. పిల్లలకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. ఒంటిపూట బడులు కావడంతో సమయ పాలన పాటించాలన్నారు. అనంతరం రిజిస్టర్ తనిఖీ చేశారు. పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.